undefined
undefined
Damarapalli mahender
ప్రేమ లేదని ప్రేమించరాదనీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
...ప్రియా జోహారులూ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
...ప్రియా జోహారులూ
లాల..లాల..లాల లాలాల లాలలా

మనసు మాసిపొతే మనిషే కాదనీ
కటిక రాయికైనా కన్నీరుందనీ
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
ఘడియ పడిన మనసు తలపు తట్టి చెప్పనీ
ముసురు కప్పి మూగబోయి నీవుంటివీ
ముసురు కప్పి మూగబోయి నీవుంటివీ
మోడు బారి నీడతోడు లేకుంటినీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ

గురుతు చెరిపి వేసీ జీవించాలనీ
చెరపలేక పోతే మరణించాలనీ
తెలిసి కూడ చెయ్యలేని వెర్రి వాడినీ
గుండె పగిలి పోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ లేదని ప్రేమించరాదనీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
...ప్రియా జోహారులూ
లలా లలా లా. లల లలా లలా లా

0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి