Damarapalli mahender

Lyrics by Lokesh
మౌనమేలనోయి...
మౌనమేలనోయి మరపు రాని రేయి
మౌనమేలనోయి మరపు రాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి మరపు రాని రేయి

పలికే పెదవి వొణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా విరిసే వయసులా
కలిసే మనసులా విరిసే వయసులా
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా

మౌనమేలనోయి మరపు రాని రేయి

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపు మడుగులా
ఇవి ఏడడుగుల వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసినా

మౌనమేలనోయి మరపు రాని రేయి
ఇంత మౌనమేలనోయి మరపు రాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో...
ఇంత మౌనమేలనోయి మరపు రాని రేయి
0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి