కలకా..లం బ్రతికేస్తా.. కలకాలం బ్రతికేస్తా....
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా... (2)
పూవుల యదలో శబ్దం.. మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదె నా హృదయం...
ఇక ఓపదే.. నా హృదయం...
సత్యమసత్యములు పక్కపక్కనే .. ఉంటయ్ పక్కపక్కనే... చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే.. చూసే కళ్లు ఒక్కటే... అయినా రెండూ వేరేలే..
||నను ప్రేమించానను ||
రేయిని మలిచి...ఓ... రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో..
కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు-చేశావో...
మెరిసే చుక్కల్ని తెచ్చి వేళి గోళ్లుగ మలచి, మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.. మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో..
అయినా...మగువ, మనసుని శిలగా చేసినా..వే
వలచే... మగువ, మనసుని శిలగా చేసినా..వే... ||నను ప్రేమించానను||
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపిందినీవేగా..
ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు.. ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..
అయినా.. చెలియ.. మనసుకి మాత్రం దూరమై..నా...వే
కరుణే.. లేక మనసుని మాత్రం వీడిపో..యా...వే... ||నను ప్రేమించానను||
ట్యాగ్: JODI - "Nanu Preminchananu Maata kalanaina cheppey nestam" LYRICS - Prashant, Simran - Singer Hariharan
కామెంట్‌ను పోస్ట్ చేయండి