undefined
undefined
Damarapalli mahender
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడిరేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో తియనైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేను (2)
undefined
undefined
Damarapalli mahender

ఏమైంది  ఈ  వేల , యెదలో  ఈ  సందడేలా
మిల  మిల  మిల  మేఘమాలా , చిటపట  చినుకేయు  వేల 
చెలి  కులుకులు  చూడగానే , చిరు  చెమటలు  పోయనేలా 
ఏ  శిల్పి  చెక్కెనీ  శిల్పం , సరికోతగా  వుంది  రూపం 
కనురెప్ప  వేయనీడు  ఆ  అందం , మనసులోన  వింత  మొహం 
మరువలేని  ఇంద్ర  జాలం , వానలోన  ఇంత  దాహం  

చినుకులలో  వాన  విల్లు , నేలకిల  జారేనే 
తలుకుమనే  ఆమె  ముందు , వేల  వేల  వేల  బోయెనే 
తన  సొగసు  తీగలాగా , నా  మనసే  లాగేనే 
అది  మొదలు  ఆమె  వైపే , నా  అడుగులు  సాగేనే 
నిశీధిలో , ఉషోదయం , ఇవలిల  ఎదురు  వస్తే 
చిలిపి  కనులు  తాళమేసే , చినుకు  తడికి  చిందులేసే 
మనసు  మురిసి  పాటపాడే , తనువు  మరిచి  ఆటలాడే 
ఏమైంది  ఈ  వేల , యెదలో  ఈ  సందడేలా 
మిల  మిల  మిల  మేఘమాలా , చిటపట  చినుకేయు  వేల 
చెలి  కులుకులు  చూడగానే , చిరు  చెమటలు  పోయనేలా 
ఆమె  అందమే  చూస్తే , మరి  లేదు  లేదు  నిదురింక
ఆమె  నన్నిలా  చూస్తే , ఎద   మోయలేదు  ఆ  పులకింత 
తన  చిలిపి  నవ్వుతోనే , పెను  మాయ  చేసెన 
తన  నడుము  వోమ్పులోనే , నెలవంక  పూచెన 
కనుల  ఎదుటే  కలగా  నిలిచ , కళలు  నిజమై  జగము  మరిచ 
మొదటి  సారి  మెరుపు  చూసా , కదలిలాగే  ఉరకలేస 
undefined
undefined
Damarapalli mahender

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
undefined
undefined
Damarapalli mahender
ఓ పాపా లాలి
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంట రా

మాటే రాని

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే

మాటే రాని
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
undefined
undefined
Damarapalli mahender

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడు లే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో..చీకటాయెలే..
నీకిది తెల్లవారని రేయమ్మా..
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం..(రాలిపోయే)

చెదిరింది నీ గూడు గాలిగా..
చిలక గోరింకమ్మ గాధగా..
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..
తనవాడు తారల్లో చేరగా..
మనసు మాంగల్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా..
తిరిగే భూమాతవు నీవై..
వేకువ లో వెన్నెలవై..
కరిగే కర్పూరము నీవై..
ఆశలకే హారతివై..(రాలిపోయే)

అనుబంధమంటేనే అప్పులే..
కరిగే బంధాలన్నీ మబ్బులే..
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే..
తన రంగు మార్చింది రక్తమే..
తనతో రాలేనంది పాశమే..
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే..
పగిలే ఆకాశం నీవై..
జారిపడే..జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై..
తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)
undefined
undefined
Damarapalli mahender
అరె  ఏమైందీ  అరె  ఏమైందీ 
ఒక  మనసుకు  రెక్కలొచ్చి  ఎక్కడికో  ఎగిరిందీ 
అది  ఏమైందీ 
తన  మనిషిని  వెదుకుచు  ఇక్కడొచ్చి  వాలిందీ 
కలగాని  కలఎదో  కళ్ళెదుటే  నిలిచిందీ 
అది  నీలో  మమతను  నిద్దురలేపింది 

నింగివంగి  నేలతోటీ  నేస్తమేదో  కోరిన్దీ 
నెల  పొంగి  నింగికోసం  పూలదోసిలిచ్చింది 
పూలు  నేను  చూడలేదు  పూజలేవి  చేయలేదు 
నేలపైన  కళ్లులేవు  నింగి  వైపు  చూపులేదు 
కన్నెపిల్ల  కళ్ళలోకి  ఎన్నడైనా  చూసావో 
కానరాని  గుండెలోకి  కన్నమేసి  వచ్చావో 
అది  దోచావో 

బీడుఉలోన  వాన  చినుకు  పిచ్చిమొలక  వేసింది 
పాడలేని  గొంతులోన  పాటా  ఏదో  పలికింది 
గుండె  ఒక్క తున్న  చాలు  గొంతు  తానె  పాడగలడు 
మాటలన్నీ  దాచుకుంటే  పాత  నీవు  వ్రాయగలవు 
రాతరాని  వాడి  రాత  దేవుడేమి  వ్రాశాడో 
చేతనైతే  మార్చి  చూడు  వీడు  మారిపోతాడు 
మనిషుతాడు 
  ఆరాధనా  (1987)
undefined
undefined
Damarapalli mahender

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

మనసు వుంది మమత వుంది
 
పంచుకునే నువ్వు తప్ప
ఊపిరి వుంది ఆయువు వుంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
 
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవత లోనూ ద్రోహం వుందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
 
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
undefined
undefined
Damarapalli mahender

Sunday, November 26, 2006

నాకు నచ్చిన తెలుగు పాటలు-20

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- S.A.రాజ్ కుమార్
గానం:- బాలు

పల్లవి
పాటల పల్లకివై ఊరెగే చిరుగాలి
కంటికి కనపడవే నిన్నెక్కెడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాశకి శ్వాశ ఆడదే
నిన్నె చెరుకొనిదే గుండెకి సందడుండదె
నీ కొసమే అన్వేషణ
నీ రూపు రేఖలెమో ఎవరిని అడగాలి

చరణం
నిలాల కనుపాప లొకాన్ని చూస్తుంది
తన రూపు తానెప్పుడు చూపించలెనంది
అద్దంలా మెరిసే ఒక హ్రుదయం కావాలి
ఆ మదిలొ వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలకువలొ కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కల్లు ఎవరిని అడగాలి

చరణం
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించె భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఈ నిమిషంలొ నీ రాగం నా మది తాకింది
తనలొ నన్నె కరిగించి పయనిస్తూ ఊంది
undefined
undefined
Damarapalli mahender

నాకు నచ్చిన తెలుగు పాటలు-3

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- S.A.రాజ్ కుమార్
గానం:- బాలు

పల్లవి
ఆలయాన హారతిలొ..ఆఖరి చితిమంటలలొ..
రెండిటిలో నిజానికి ఉన్నది ఒకతె అగ్ని గుణం
ప్రెమ అనే పదన ఉన్నది అరని అగ్ని కణం
దీపన నిలబెడుతుంధొ..తాపాన బలి పెడుతుంధొ..
అమ్రుతమో..హలహలమో...ఎమో ఈ ప్రెమగుణం
ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం

చరణం
ఎండమావిలొ ఎంత వెతికినా..నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలొ ఉన్న ఆశె ఆవిరి అవ్తున్న.. ప్రపంచాన్ని మరిచెలా మంత్రించె ఒ ప్రేమ
ఎలా నిన్ను కనిపెట్టాలొ ఆచూకి ఇవ్వమ్మ!
నీ జడ తెలియని ప్రాణం..చెస్తొంది గగన ప్రయాణం
ఎదర ఉన్నధి నడి రేయి అన్నధి ఈ సంధ్య సమయం

ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం

చరణం
చరణం
సుర్యబింబమే అస్థమించనిధే..మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనె కంటి పాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలొ మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన అగెనా..
పొందేది ఎది ఎమైనా..పొయింధి తిరిగి వచ్చెనా?
కంటి పాప కల అడిగింధి అని నిధురించెను నయనం

ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం
undefined
undefined
Damarapalli mahender
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం.......

ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలసితిని బదులిక లేకా
నీవే జతలేని శిథిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో

నీ నవ్వులో అందము జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని

దిగులుపడే సొగసులతో దినములు సాగే
రుచలడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరుగులు తీసే
చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో

నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం.....
..
undefined
undefined
Damarapalli mahender
నీ  యదలో  నాకు  చోటే  వద్దు 
నా  యెదలో  చోటే  కోరవద్దు
మన  ఎదలో  ప్రేమను  మాటే  రాదు 
ఇవ్వి   పై  పైన  మాటలు  లీ  హే  హే
నీ  నీడై  నడిచి  ఆశలేదే
నీ  తోడై  వచ్చే  ద్యాస  లేదే
నీ  తోటే  ప్రేమ  పొతే  పోనీ
అని  అబద్దాలు  చెప్పలేను  లీ
నీ  జతలోన , నీ  జతలోన
ఈ  ఎండ  కాలం , నాకు  వాన  కాలం
నీ  కలలోన , నీ  కలలోన
మది  అలలాగా , Cheru ప్రేమ  తీరం
నీ  ఎదలో  నాకు  చూటే  వద్దు
నా  యెదలో  చోటే  కోరవద్దు
మన  ఎదలో  ప్రేమను  మాటే  రద్దు 
ఇవ్వి   పై  పైన  మాటలు  లీ  హే  హే

చిరుగాలి  తరగంటి  నీ  మాటకీ 
ఎద  పొంగెను  ఒక  వెల్లువై
చిగురాకు  రాగల  నీ  పాటకే 
తను  ఊగెను  తొలి  పల్లవి
ప్రేమ  పుట్టాక  న  కళ్ళలో 
దొంగ  చూపేదో  పూరి  విప్పేనే
కొంచం  నటనున్నది
కొంచం  నిజమున్నది 
ఈ  సైయట బాగున్నది
నువ్వు వల  వేస్తె , నువ్వు  వల  వేస్తే
నా  ఎద  మారే , న  కదా  మారే
అరేయ్  ఇది  ఏదో  ఒక  కొత్త  దాహం 
అది  పెరుగుతుంటే  వీచే  చెలి  స్నేహం

ఒకసారి  మౌనం  గా  నను  చూడవే
ఈ  నిమిషమే  యుగామౌనులేయ్
నీ  కళ్ళలో  నన్ను  బందిన్చావే
ఆ  చేర  నాకు  సుకమౌను  లీ
 నిన్ను  చూసేటి  నా  చూపులో
కరిగే  ఎనేన్ని  ముని  మాపులో
పసి  పాపి  ఇలా , నా  కనుపాపలేయ్ 
నీ  జాడల్లో  తోగాదేనే
తొలి  సందేలలో ,తొలి  సందేలలో
ఎరుపే  కాదా  నీకు  సింధూరం
మాలి  సందేలలో , మాలి  సందేలలో
నీ  పాపితిలో  యెర్ర  మందారం
నీ  యదలో  నాకు  చూటే  వద్దు
నా  యెదలో  చోటే  కోరవద్దు
Mana Yedhalo ప్రేమను  మాటే  రాదు 
ఇవ్వి  పై  పైన  మాటలు  లీ  హే  హే
నీ  నీడై  నడిచి  ఆశలేదే
నీ  తోడై  వచ్చే  ద్యాస  లేదే
నీ  తోటే  ప్రేమ  పొతే  పోనీ
అని  అబద్దాలు  చెప్పలేను  లీ 
undefined
undefined
Damarapalli mahender
ఎదుట  నిలిచింది  చూడు జలతారు  వెన్నెలేమో …
ఎదను తడిపింది  నేడు  చినుకంటి  చిన్నదేమో …
మైమరచిపోయా  మాయలో …
ప్రాణమంత  మీటుతుంటే  వాన  వీణలా … ||ప || ఎదుట  నిలిచింది  చూడు …
నిజంలాంటి  ఈ  స్వప్నం .. ఎలాపట్టి ఆపాలి …
kale  అయితే  ఆ  నిజం  ఎలా  తట్టుకోవాలీ …
అవునో  కాదో  అడగకంది  నా  మౌనం …
చెలివో  శిలవో  తెలియకుంది  నీ  రూపం …
చెలిమి  బంధం  అల్లుకుందే .. జన్మ  ఖైదులా …


ఎదుట  నిలిచింది  చూడు …


నిన్నే  చేరుకోలేకా .. ఎటేల్లిందో  నా  లేఖ …
వినేవారు  లేకా .. విసుక్కుంది  నా  కేక …
నీదో  కాదో  వ్రాసున్న  చిరునామా 
వుందో  లేదో  ఆ  చోట  నా  ప్రేమా 
వరంలాంటి  శాపమేదో  సొంతమైందిలా 

ఎదుట  నిలిచింది  చూడు … ||ప ||

undefined
undefined
Damarapalli mahender
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
| edit post