Damarapalli mahender
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే(2)
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా(2)

ఇది సరసాల తొలి పరువాల
జత సాయంత్రం సయ్యన్న మందారం(2)
చెలి అందాల చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా..పిల్లా..
భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేను కుసుమాలు పచ్చ కంటి మీనా
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలి ఈ వేళ(వెన్నెలవే)

ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట
కౌగిట్లో చిక్కు పడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించే
హృదయంలో వెన్నెలలే రగిలించేవారెవరు
పిల్ల..పిల్ల..
పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళ

ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు(వెన్నెలవే)
0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి