Damarapalli mahender
నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
నింగినెన్నటికీ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే చెలీ.....
నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హోరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే.....
నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేనూ కట్టుకున్న కోటా
నేడుకూలి పోయే ఆశ తీరుపూటా
కోరుకున్న యోగం జారుకుంది నేడూ
చీకటేమో నాలో చేరుకొంది చూడూ
రాసివున్న తలరాత తప్పదూ చిత్రమే అది చిత్రమే
గుండెకోతలే నాకు ఇప్పుడూ చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే....

నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
నింగినెన్నటికీ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే చెలీ.....
నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి