Damarapalli mahender
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ

ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ

పువ్వు తేటిదన్నది ఏనాడొ రాసున్నదీ
ముద్దూ మోవిదన్నది పొద్దొ రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా
పరువాలే...ప్రణయాలై...స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలిగెను
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ

మేఘం వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
రాగం గుండె లోతున గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగా
కౌగిళిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగా
మోహాలే.....దాహాలై...సరసాలే...సరదాలై...
కాలాన్నే నిలవెసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో ఆనురాగం ఆనాటిదీ


0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి