Damarapalli mahender

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)
గానమిది నీ ధ్యామిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (2)

ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
చేసారు గుండెల్లొ రేగే గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది






0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి