Damarapalli mahender


మనసున  ఉన్నది  చెప్పాలనున్నది   మాటలు  రావే  ఎలా
మాటున  వున్నది  ఓ మంచి  సంగతి  బయటికి  రాదే  ఎలా
అతడిని  చూస్తే  రెప్పలు  వాలిపోయే  బిడియం  ఆపేదెలా
ఎదురుగా  వస్తే  చెప్పక  ఆగిపోయే  తలపులు  చూపెదేలా
ఒక్కసారి  దరిచేరి యేద  గొడవేమిటో తెలపకపోతే  ఎలా
  

మనసున  ఉన్నది  చెప్పాలనున్నది  

మాటలు  రావే  ఎలా
 లలల ...
 


చింత  నిపల్లె  చల్లగా  వుందండి  ఎంత  నొప్పైన  తెలియలేదని
తననే  తలచుకొనే  వేడిలో ప్రేమ  అంటేనే  తీయని  బాధని
లేత  గుండెల్లో  కొండంత  బరువని కొత్తగా  తెలుసుకునే  వేళల్లో
కనపడుతోందా  నా  ప్రియమైన  నీకు నా  ఎదకోత  అని  అడగాలని
అనుకుంటూ  తన  చుట్టూ  మరి  తిరిగిందని
తెలపకపోతే  ఎలా

మనసున  ఉన్నది  చెప్పాలనున్నది
మాటలు  రావే  ఎలా
 లలల ...

నీలి  కన్నుల్లో  అతని  బొమ్మని చూసి  నాకింకా  చోటేక్కడుందని
నిద్దరే  కసురుకునే  రేయిలో మేలుకున్న  ఇదే  వింత  కైపని
వేల  ఊహలో  ఊరేగే  చూపుని కలలే  ముసురుకొనే  హాయిలో
వినపడుతోందా  నా  ప్రియమైన  నీకు ఆసల  రాగం  అని  అడగాలని
పగలేదో  రేయఎదో  గురుతేలేదని తెలపకపోతే  ఎలా
 


మనసున  ఉన్నది  చెప్పాలనున్నది  మాటలు  రావే  ఎలా
మాటున  వున్నది  ఓ  మంచి  సంగతి బయటికి  రాదే  ఎలా
అతడిని  చూస్తే  రెప్పలు  వాలిపోయే బిడియం  ఆపేదెలా
ఎదురుగా  వస్తే  చెప్పక  ఆగిపోయే  తలపులు  చూపెదేలా
ఒక్కసారి  దరిచేరి యేద  గొడవేమిటో
తెలపకపోతే  ఎలా 

0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి