నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే(2)ఒక కంట నీరులతో పెదవెంట ఉసురులతో
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలం మరిచి అడవి చెట్టు పూచెనులే(నెల్లూరి)
జొన్నకంకి ధూళే పడినట్టు
కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే
ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని
వేళ్ళతో ఒత్తిన మెడపై రగిలిన
తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే(నెల్లూరి)
ఒక ఘడియ కౌగిలి బిగియించి
నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేర
నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో
కలిసిపోయే వరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండంగా
నువ్వు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా(నెల్లూరి)
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడు పసుపులాగ
నన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే(2)ఒక కంట నీరులతో పెదవెంట ఉసురులతో
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలం మరిచి అడవి చెట్టు పూచెనులే(నెల్లూరి)
జొన్నకంకి ధూళే పడినట్టు
కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే
ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని
వేళ్ళతో ఒత్తిన మెడపై రగిలిన
తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే(నెల్లూరి)
ఒక ఘడియ కౌగిలి బిగియించి
నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేర
నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో
కలిసిపోయే వరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండంగా
నువ్వు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా(నెల్లూరి)
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడు పసుపులాగ
నన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
కామెంట్‌ను పోస్ట్ చేయండి