మెరిసే తారలదేరూపం - విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం..
మనసున కొలువై మమతల నెలవై - వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //
చరణం 1 :
ఎవరి రాకతో గళమున పాటల - ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను - ఎలకోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి - తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై - నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //
చరణం 2 :
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా - గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి - ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే.. - నా ప్రాణ స్పందన
నీకే నా - హృదయ నివేదన // మనసున కొలువై //
కామెంట్‌ను పోస్ట్ చేయండి