నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
మనసు వుంది మమత వుంది
పంచుకునే నువ్వు తప్ప
ఊపిరి వుంది ఆయువు వుంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవత లోనూ ద్రోహం వుందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
కామెంట్‌ను పోస్ట్ చేయండి